ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “వేట్టయన్”

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “వేట్టయన్”

Published on Oct 10, 2024 10:25 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ లాంటి దిగ్గజాలతో దర్శకుడు టీజె జ్ఞానవేల్ కాంబినేషన్ లో చేసిన చిత్రం “వేట్టయన్”. మరి ఇంట్రెస్టింగ్ పోలీస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో సహా తమిళ్ మరియు ఇతర పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చింది.

మరి ఈ చిత్రం తెలుగులో మరీ అంత బజ్ నడుమ రాలేదు కానీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో అయితే స్టార్ట్ అందుకుంది. ఇక ఈ చిత్రం థియేటర్స్ రిలీజ్ అనంతరం ఏ ఓటిటిలో రానుందో ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. మరి ఈ చిత్రాన్ని థియేటర్స్ తర్వాత అయితే ఈ ఓటిటిలో చూడొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు