ఓటిటి పార్ట్నర్ లాక్ చేసుకున్న శివ కార్తికేయన్ “మావీరన్”.?


టాలీవుడ్ లో మంచి ఆదరణ ఉన్నటువంటి కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో శివ కార్తికేయన్ కూడా ఒకరు. మరి శివ కార్తికేయన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “ప్రిన్స్” ఆకట్టుకోగా నెక్స్ట్ అయితే టాలెంటెడ్ దర్శకుడు మడోనే అశ్విన్ రీసెంట్ హిట్ చిత్రం మండేలా” ఫేమ్ తో చేస్తున్న చిత్రం “మావీరన్”.

మరి తెలుగులో కూడా “మహా వీరుడు” తో రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ సినిమా ఓటిటి డీల్ అయితే లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని అయితే తెలుగు సహా తమిళ్ భాష హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది.

అలాగే తన కెరీర్ లో అయితే రికార్డు ధరకి ఈ డీల్ లాక్ అయ్యినట్టుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ చిత్రానికి కూడా మండేలా ఫేమ్ భరత్ శంకర్ సంగీతం అందిస్తుండగా శాంతి టాకీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version