‘మట్కా’ ఓటీటీ హక్కుల పై క్లారిటీ

హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి – నోరా ఫతేహి హీరోయిన్స్ గా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా చిత్రం “మట్కా”. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. పైగా వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

కాగా ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ ను లాక్ చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

ఇప్పటికే, వరుణ్ తేజ్ వింటేజ్ లుక్ పోస్టర్ ను రివీల్ చేస్తూ.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ సాలిడ్ కొట్టడం గ్యారెంటీ అంటూ మెగా ఫ్యాన్స్ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తోందో చూడాలి.

Exit mobile version