ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “గాడ్ ఫాదర్”.!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాదర్”. దర్శకుడు జయం మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో అయితే డీసెంట్ హిట్ గా ఈ చిత్రం నిలవగా థియేటర్స్ లో అయితే ఈ చిత్రం రన్ ని ముగించుకుంది. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.

ఇక ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్న దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేశారు. ఈ చిత్రం అయితే తెలుగు మరియు హిందీలో ఈ నవంబర్ 19 నుంచి అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే గాడ్ ఫాదర్ ఆరోజు నుంచి అందుబాటులో ఉండనుంది. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందివ్వగా సత్యదేవ్, నయనతార తదితరులు కీలక పాత్రల్లో నటించగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version