కిరణ్ అబ్బవరం “సమ్మతమే” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Jul 7, 2022 10:00 am IST


మన టాలీవుడ్ లేటెస్ట్ షైనింగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా అలాగే తెలుగు యువ హీరోయిన్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సమ్మతమే” కోసం తెలిసిందే. దర్శకుడు గోపినాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం కిరణ్ ఆబ్బవరం కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రం గత కొన్ని రోజులు కితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై అప్డేట్ బయటకి వచ్చింది. ఏఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్న “ఆహా” వారు ఈ చిత్రాన్ని ఈ జూలై 15 నుంచి ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కి తీసుకు వస్తున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందివ్వగా యూజీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :