మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మిస్టర్ బచ్చన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం గత ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో పెర్ఫామ్ చేయలేదు. దీనితో రవితేజ, హరీష్ శంకర్ ల నుంచి ఒక డిజప్పాయింటింగ్ సినిమా గానే మిగిలిపోయింది. అయితే ఇక ఈ చిత్రం ఓటిటిలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.
ఈ చిత్రం ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంని నెట్ ఫ్లిక్స్ వారు ఈ సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా ఫిక్స్ చేసేసారు. అలాగే ఒక్క తెలుగులోనే కాకుండా ఈ చిత్రం తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. మరి అప్పుడు మిస్ అయ్యినవాళ్లు అయితే ఇప్పుడు ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
Sarihaddhu ni kaapade sainikuduni choosuntaru, sampadha ni kaapade sainikuduni ippudu choostharu. #MrBachchan is coming to Netflix on 12 September in Tamil, Telugu, Malayalam and Kannada! #MrBachchanOnNetflix pic.twitter.com/mlCoioO0vS
— Netflix India South (@Netflix_INSouth) September 7, 2024