“మత్తు వదలరా 2” ఓటిటి డేట్ వచ్చేసింది.!

“మత్తు వదలరా 2” ఓటిటి డేట్ వచ్చేసింది.!

Published on Oct 9, 2024 3:00 PM IST

రీసెంట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన హిట్ చిత్రాల్లో క్రేజీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం “మత్తు వదలరా 2” కూడా ఒకటి. శ్రీసింహా హీరోగా ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లో కమెడియన్ సత్య సాలిడ్ రోల్ లో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం మంచి వసూళ్లు తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా అందుకొని అదరగొట్టింది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇందులో వారు ఈ అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ లో పొందుపరిచారు. దీనితో ఈ క్రేజీ థ్రిల్లర్ ఆరోజు నుంచి రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు