టాక్..”బీస్ట్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

ఇళయ దళపతి జోసెఫ్ విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటెర్టైనెర్ చిత్రం “బీస్ట్”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గత బుధవారం రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే తమిళ నాట మంచి వసూళ్ళని అందుకుంటూ కొనసాగుతున్న ఈ సినిమా ఓటిటి హక్కులు మరియు రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది.

అయితే ఈ సినిమా తాలూకా పాన్ ఇండియా హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు మరియు సన్ నెక్స్ట్ వారు కొనుగోలు చెయ్యగా వీటిలో ఈ రానున్న మే 11 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేయనున్నట్టు టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version