ఓటిటిలో విక్రమ్ “కోబ్రా” రిలీజ్ కి డేట్ ఫిక్స్.?

Published on Sep 24, 2022 2:59 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా కేజీయఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం ‘కోబ్రా”. ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఒక యావరేజ్ సినిమాగా నిలిచింది. మరి కొన్ని అంశాల్లో బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగులో మంచి ఓపెనింగ్స్ కూడా సాధించింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి అయితే అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకోగా ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సెప్టెంబర్ 28 నుంచి స్ట్రీమ్ కానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే ఈ చిత్రాన్ని అపుడు మిస్ అయ్యినవారు ఉంటే ఈసారి చూడొచ్చు. ఇక ఈ భారీ సినిమాలో మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే అజయ్ జ్ఞ్యాన ముత్తు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :