ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “కిల్”.. కానీ?

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “కిల్”.. కానీ?

Published on Jul 21, 2024 10:03 AM IST

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన క్రేజీ అండ్ ఒక సర్ప్రైజింగ్ హిట్ చిత్రం “కిల్” కోసం బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు ఇది హాలీవుడ్ వరకు కూడా వెళ్ళింది. మన ఇండియా సినిమా నుంచే ఒక క్రేజీ యాక్షన్ డ్రామాగా ఇది మంచి టాక్ తెచ్చుకుంది. అయితే బాలీవుడ్ లో సాలిడ్ వసూళ్లు అందుకుంటూ వెళుతున్న ఈ సినిమాలో హీరోగా లక్ష్య లల్వాని హీరోగా తన్యా మలికట్ల హీరోయిన్ గా దర్శకుడు నిఖిల్ నగేష్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది.

మరి ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ఎంట్రీకి రాబోతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ఈ జూలై 23 నుంచే రానుంది అని తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమా వచ్చే అన్ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో రెంటల్ గా ముందు అందుబాటులోకి వస్తుందట. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ+, అలాగే గూగుల్ ప్లే మూవీస్ లో కూడా రాబోతుందట. ఈ అన్నిటిలో కూడా వీడియో ఆన్ డిమాండ్ లా డబ్బులు పే చేసి చూసే విధంగా రాబోతుందని టాక్. ఇక ఈ చిత్రం ఫ్రీ స్ట్రీమింగ్ సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు