గత కొంత కాలం నుంచి మళయాళ సినిమా నుంచి ఎలాంటి సూపర్ హిట్స్ వస్తున్నాయో అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని జానర్స్ నుంచీ సాలిడ్ హిట్స్ ని అందిస్తున్న మళయాళ సినిమా నుంచి ఈ మధ్య కాలంలో మంచి థ్రిల్లర్స్ ఎక్కువ అయ్యాయి. ఇలా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ అయ్యిన చిత్రమే “ఆఫీసర్ ఆన్ డ్యూటీ”. మళయాళంలో భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రంలో కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమా నిన్ననే తెలుగులో రిలీజ్ అయ్యింది.
కానీ ఇపుడు ఇంట్రెస్టింగ్ గా తెలుగు సహా ఇతర భాషల్లో కూడా ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో ఈ 20 నుంచే అందుబాటులో ఉండనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ కొన్ని రోజులకి థియేటర్స్ కి వెళ్ళాలి అనుకునే వారు థియేటర్స్ లో చూడొచ్చు లేదా ఓటిటి వరకు ఆగొచ్చు. ఇక ఈ చిత్రాన్ని జీతూ అష్రఫ్ దర్శకత్వం వహించగా మార్టిన్ పరక్కత్ అలాగే సిబి చరవ, రెనజిత్ నైర్ నిర్మాణం వహించారు.
Puthiya officer etheetund, stand in line and salute ????
Watch Officer on Duty on Netflix, out 20 March in Malayalam, Hindi, Telugu, Tamil, Kannada#OfficerOnDutyOnNetflix pic.twitter.com/1Y8O7aK3ln— Netflix India South (@Netflix_INSouth) March 15, 2025