ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ “శబరి”


తన నటనతో మన సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి పేరు తెచ్చుకున్న వెర్సటైల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కోసం తెలిసిందే. తమిళ్ సహా తెలుగులో ఎన్నో సినిమాల్లో ఆమె సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన చిత్రాల్లో ఆమెపై సోలోగా వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమానే “శబరి”. మరి ఓ థ్రిల్లర్ గా ఈ ఏడాది మే లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల అయ్యింది.

అయితే అనుకున్న రేంజ్ హిట్ కాని ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా రానున్న అక్టోబర్ 11 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానుండడం ఫిక్స్ అయ్యింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు అయితే ఈ చిత్రాన్ని ఇపుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అనీల్ కాట్జ్ దర్శకత్వం వహించగా గోపి సుందర్ సంగీతం అందించాడు అలాగే మహా మూవీ ప్రొడక్షన్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version