ఓటీటీ రివ్యూ : ఆశ్రమం ( ఎమ్.ఎక్స్ ప్లేయర్ లో ప్రసారం)

తారాగణం: బాబీ డియోల్ తదితరులు

దర్శకుడు: ప్రకాష్ జహా
రచన : కుల్దీప్ రుహిల్, తేజ్పాల్ సింగ్ రావత్, అవినాష్ కుమార్, మాధవి భట్
నిర్మాత :  ప్రకాష్ జహా
ఎడిటర్ : సంతోష్ మండల్
సంగీతం : చందన్ కౌలి

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సిరీస్ గా వచ్చిన సిరీస్ ఆశ్రమం. ఈ సిరీస్ ‘ఎమ్.ఎక్స్ ప్లేయర్’లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

కథ :

రెండవ సీజన్ పమ్మీ (ఆదితి పోహంకర్) వెనుకబడిన కులానికి చెందిన అమ్మాయి, కాశీపూర్ వాలే బాబా (బాబీ డియోల్) చేత పూర్తిగా ప్రభావితం అవుతొంది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, పమ్మీని తన సోదరుడి నుండి బాబా వేరు చేశాడని ఆమెకు తెలియదు. అలాగే, బాబా చాలా ప్రసిద్ది చెందిన వ్యక్తి కాబట్టి, అతను తన సామ్రాజ్యాన్ని నడపడానికి ఎక్స్ సీఎంను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను ప్రస్తుత సీఎం నుండి కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటి ? అసలు మిగిలిన కథ ఏమిటి ? అలాగే నకిలీ బాబా చివరకు ఎలా బహిర్గతమైయ్యాడు ? అనేది మిగిలిన కథ.

ఏం బాగుంది :

మొదటి సీజన్ మాదిరిగా కాకుండా, బాబీ డియోల్ తన పాత్రను అంతే బలంగా ప్రదర్శించడానికి ఆయనకు ఎక్కువ స్కోప్ దొరికింది. దాంతో అతను అద్భుతమైన నటన కనబర్చాడు, చెడ్డవాడుగా, దుర్మార్గుడుగా ఆయన అద్భుతంగా నటించాడు. ఇక బాబీ డియోల్ తన రెగ్యులర్ బాలీవుడ్ పాత్రల నుండి యు-టర్న్ తీసుకుని నకిలీ బాబాగా నటించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అదితి పోహంకర్‌కు మంచి పాత్ర దక్కింది. అలాగే ఆమె అద్భుతమైన నటన కనబర్చింది. ఇక సీజన్ 2 లో ఆమె పాత్రకు ఎక్కువ స్పెస్ లభించింది. ఇక త్రిదా చౌదరి తన పాత్రలో ఆకర్షణీయంగా ఉంది మరియు రెండవ సీజన్లో ఆమె ధైర్యమైన చర్యలతో చాలా మందికి షాక్ ను ఇచ్చింది.

నకిలీ బాబా పనిచేసే విధానంకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రదర్శించిన సీన్స్ బాగున్నాయి. సిరీస్ యొక్క BGM అద్భుతమైనది. కెమెరావర్క్‌కు ప్రత్యేక ప్రస్తావన అవసరం. అంత బాగుంది కెమెరా వర్క్.

ఏం బాగాలేదు :

రెండవ సీజన్లో అతిపెద్ద హైలైట్ అయిన టెన్షన్ మరియు సస్పెన్స్ కు పెద్దగా రీజన్ లేదు కథలో. నకిలీ బాబా మరియు ప్రధాన పాత్రల మధ్య వచ్చే సీన్స్ మొదట్లో బాగున్నా… ఆ తరువాత వచ్చే సీన్స్ మాత్రం అంత గొప్పగా ఏమి లేవు . పైగా కథ పేస్ కూడా చాలా నెమ్మదిగా ఉంది. అలాగే కథనం ఇంకా బాగా వివరించాల్సిన అవసరం ఉంది.

బాబా తన శారీరక సంబంధాలను ఎలా ఆనందిస్తారనే కోణంలో వచ్చే సీన్స్ ఏ మేరకు ఆసక్తికరంగా లేవు. అలాగే క్లైమాక్స్ కూడా ఎటువంటి కారణం లేకుండా విస్తరించి ఇబ్బంది పెట్టారు. ఇంకా సరళమైన పద్ధతిలో ముగించి ఉంటే బాగుండేది.

తీర్పు :

మొత్తం మీద, బాబీ డియోల్ యొక్క ఆశ్రమం రెండో సీజన్ హైప్‌కు తగ్గట్లు అనుగుణంగా లేదు. కథనం బాగున్నా.. నటీనటులు ప్రదర్శనలు అద్భుతమైనవి అయినప్పటికీ, నెమ్మదిగా సాగే ట్రీట్మెంట్, బోరింగ్ సీన్స్ బాగా ఇబ్బంది పెడతాయి. అలాగే నకిలీ బాబాను అతని పాత్రలో అంత గొప్పగా చూపించలేకపోయారు. కానీ, ఈ సిరీస్ ను ఒక్కసారి హ్యాపీగా చూడొచ్చు.

Rating: 2.75/5

Click here to Read the Review of Aashram -Season 1

Exit mobile version