యశోద ఓటీటీ రాక పై కొత్త పుకారు !

Published on Dec 5, 2022 2:05 pm IST

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యశోద చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. కాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. త్వరలోనే ఈ సినిమా.. ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ప్లాట్‌ఫారమ్‌లో డిసెంబర్ 9, 2022న ఈ చిత్రాన్ని ప్రీమియర్ చేస్తుందని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ లాభాలను అందుకుంది. సరోగసీ కి సంబంధించిన సున్నితమైన అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ విలన్ గా నటించింది. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. మొత్తానికి సమంత యశోదతో చాలా మంది హృదయాలను గెలుచుకుంది.

సంబంధిత సమాచారం :