యంగ్ టైగర్ మాస్..షో గ్రాఫ్ ఒక లెక్కలో పెంచుతున్న తారక్.!

Published on Sep 16, 2021 3:37 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భారీ చిత్రం “RRR” షూట్ అంతా కంప్లీట్ చేసుకొని మరో బిగ్గెస్ట్ రియాలిటీ షో కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే “ఎవరు మీలో కోటీశ్వరులు”. ఎన్నో అంచనాలతో స్టార్ట్ అయ్యిన ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ తోనే రికార్డు స్థాయి టీఆర్పీ అందుకుంది. అంతే కాకుండా ఆ వారం తర్వాత కూడా భారీ వ్యూవర్ షిప్స్ ని తెచ్చుకుంటూ షో యావరేజ్ గ్రాఫ్ ని పెంచుకుంటూ వెళుతుంది.

మరి దీనికి ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరిని ఎంతో అలరించే ఈ షో ని అంతకు మించి ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లడం ఒక్క హోస్ట్ చేతుల్లోనే ఉంటుంది. మరి దానికి తారక్ మాస్ చూపించాడనే చెప్పాలి. మరి లేటెస్ట్ గా ఈ షో రేటింగ్ బయటకి వచ్చింది.

మూడో వారం ఈ షోకి గాను 7.3 రేటింగ్ తో ముందు రెండు వారాలని కూడా క్రాస్ చేసేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనిని బట్టి షో గ్రాఫ్ ఎలా పెరుగుతూ వెళ్తుందో మనం గమనించవచ్చు. మొత్తానికి మాత్రం తారక్ తన హోస్టింగ్ కి తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :