ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ‘యూఐ’ దూకుడు

ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ‘యూఐ’ దూకుడు

Published on Dec 26, 2024 11:07 PM IST

కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘యూఐ’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమాను ఉపేంద్ర స్వయంగా డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులకు వింటేజ్ ఉపేంద్రను గుర్తుకు చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ఉప్పి అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఈ మూవీ అక్కడి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. యూఐ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 200K డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఉప్పి ఫీవర్‌తో ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేటర్స్‌కు వెళ్తున్నారని వారు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని వారు ఆశిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఉపేంద్ర డ్యుయల్ రోల్‌లో నటించాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు