ప్రభాస్ ను కలిసిన “కల్కి” ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్!

ప్రభాస్ ను కలిసిన “కల్కి” ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్!

Published on Jun 26, 2024 11:55 PM IST

వరల్డ్ వైడ్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి2898 AD మ్యానియా నడుస్తోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ కాస్ట్ ఉండటం మరింత హైప్ ను క్రియేట్ చేయడం జరిగింది.

ఈ చిత్రం ను ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా మూవీస్ వారి విజయ్ కుమార్ హీరో ప్రభాస్ ను కలిశారు. అందుకు సంబంధించిన ఫోటో ను ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి కాంబినేషన్ బాక్సాఫీస్ రికార్డులను రిలీజ్ కి ముందే తిరగరాసింది. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత డే 1 ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు