ఓవర్సీస్ కింగ్ ప్రభాస్.. “కల్కి” సెన్సేషనల్ ఆల్ టైం రికార్డ్

ఓవర్సీస్ కింగ్ ప్రభాస్.. “కల్కి” సెన్సేషనల్ ఆల్ టైం రికార్డ్

Published on Jun 28, 2024 10:12 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా మొదలైన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొల్పుకోగా ఈ అంచనాలు నడుమ గ్రాండ్ గా అయితే నిన్న రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా రిలీజ్ గా వచ్చింది అని చెప్పాలి.

మరి యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం లేటెస్ట్ గా భారీ వసూళ్లు అందుకుని ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాకి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కి జరిగిన ప్రీ సేల్స్ లో అలాగే రిలీజ్ రోజు వసూళ్లు కలిపి ఒక ఆల్ టైం రికార్డు నెంబర్ నమోదు అయ్యినట్టుగా వినిపిస్తుంది. కేవలం ఈ చిత్రం ప్రీమియర్స్ కే దాదాపు 4 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని అందుకోగా మొదటి రోజుకి గాను 1.59 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకుంది.

దీనితో ఈ చిత్రం 5.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని కేవలం ఈ ఒక్క రోజు నాటికే కొట్టేసింది. దీనితో అక్కడ ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తూ వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మరోసారి ఓవర్సీస్ మార్కెట్ లో ప్రభాస్ కి తిరుగు లేదని దీనితో నిరూపించుకున్నాడు. ఇక ఈ చిత్రానికి నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు