మహేష్ బాబుకి IIFA అవార్డు

మహేష్ బాబుకి IIFA అవార్డు

Published on Sep 13, 2024 7:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో అనుష్క శెట్టి నటించిన లాస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఎలాంటి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేశారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి IIFA అవార్డు దక్కింది.

టెక్నికల్ విభాగంలో బెస్ట్ డైలాగ్స్‌కి మహేష్ బాబు ఈ అవార్డును అందుకున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీలోని డైలాగ్స్ హృదయాలను హత్తుకునేలా ఉన్నాయని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఈ డైలాగ్స్‌కి అవార్డు కూడా రావడం విశేషం. ఇక ఈ సినిమాలో అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. IIFA 2024 అవార్డు అందుకున్న మహేష్ బాబుకి పలువురు సినీ సెలెబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు