లెజెండరీ సింగర్ పి.సుశీల (88) కిడ్నీ సమస్య కారణంగానే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. పి.సుశీల 1935 నవంబర్ 13న విజయనగరంలో జన్మించారు. 1950 నుంచి 1990 వరకు 11 భాషల్లో 50వేలకు పైగా పాటలు పి.సుశీల పాడారు. పి.సుశీలను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
పైగా ఉత్తమ గాయనిగా 5 నేషనల్ అవార్డులను కూడా పి.సుశీల గారు అందుకున్నారు. సుశీలకు వైద్యుడైన మోహనరావుతో వివాహం జరిగింది. వీరికి జయకృష్ణ అనే కుమారుడు, జయశ్రీ, శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ ఇరువర్ కూడా గాయని. ప్రస్తుతం పి.సుశీల ఆరోగ్యం నిలకడగా ఉంది.