ఓటిటి సమీక్ష: పాతాళ లోక్ సీజన్ 2 – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో

ఓటిటి సమీక్ష: పాతాళ లోక్ సీజన్ 2 – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో

Published on Jan 18, 2025 9:45 PM IST
Paatal Lok Season 2 Series Review in Telugu

Release Date : January 17, 2025

123telugu.com Rating : 3/5

నటీనటులు : జైదీప్ అహ్లావత్, ఇష్వాకే సింగ్, మెరెన్ల ఇంసొంగ్, కాగిరాంగ్, నగేష్ కుమార్, తిలోత్తమా షోమే తదితరులు.

దర్శకుడు : అవినాష్ అరుణ్ ధవారే

నిర్మాతలు : కర్ణేశ్ శర్మ, బబిత ఆశివాల్

సంగీతం : బెనెడిక్ట్ టైలర్, నరేన్ చందవర్కర్, వినీత్ డిసౌజా

సినిమాటోగ్రఫీ : అవినాష్ అరుణ్

ఎడిటర్ : సంయుక్త కాజా

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన ఇండియన్ కంటెంట్ నుంచి సూపర్ హిట్ అయ్యిన పలు ఫేమస్ వెబ్ సిరీస్ లలో “పాతాళ లోక్” కూడా ఒకటి. గత లాక్ డౌన్ లో వచ్చిన ఈ సిరీస్ సీజన్ 1 పలు కాంట్రవర్సీలతో పాటుగా పెద్ద హిట్ అయ్యింది. మరి దాదాపు ఐదేళ్ల తర్వాత దీనికి సీజన్ 2 మంచి అంచనాలు నడుమ వచ్చింది. ఇక ఈ సీజన్ కూడా మెప్పించిందో లేదో చూద్దాం.

కథ:

సీజన్ 1 నుంచి కొనసాగింపుగా ఢిల్లీలోని తన పోలీస్ స్టేషన్ లోనే అదే పొజిషన్ లో హాతీరాం చౌదరి(జైదీప్ ఆహ్లావత్) కొనసాగుతారు. కానీ తన కింద ట్రైనింగ్ కి వచ్చిన ఇమ్రాన్ అన్సారీ(ఇస్వాక్ సింగ్) మాత్రం ఐఏఎస్ అధికారిగా మారిపోతాడు. ఈ నేపథ్యంలోనే నాగాలాండ్ కి చెందిన ఓ పవర్ఫుల్ బిగ్ విగ్ జోనాథన్ తాం(కాగిరాంగ్) హోటల్లో అత్యంత దారుణంగా హత్య చేయబడతాడు. దీనితో నాగాలాండ్ లో అది పెద్ద కేసుగా మారుతుంది. ఇది అన్సారీకి సవాలుగా మారగా ఇంకోపక్క హాతీరాం చౌదరికి కూడా ఢిల్లీలో రఘు పాశ్వాన్(శైలేష్ కుమార్) మిస్సింగ్ అందులో రోస్ లిజో(మెరెన్ల ఇంసొంగ్) అనే యువతికి ఉన్న లింక్ ఆ కేసు సెపరేట్ గా ఇన్వెస్టిగేట్ చేసిన ఒక పాయింట్ లో అన్సారీ కేసుతో కూడా కలుస్తుంది. ఈ నేపథ్యంలో వారికి ఉన్న లింక్ ఏంటి? ఇందులో కపిల్ రెడ్డి(నగేష్ కుకునూర్) చేసిన ప్లాన్, అసలు డ్రామా అంతటి వెనుక ఉన్నది ఎవరు? ఆ రెండు కేసులు ఎలా సాల్వ్ అయ్యాయి అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మొదటి సీజన్ మంచి హిట్ కావడానికి ఉన్న ప్రధాన కారణాల్లో సాలిడ్ ఎమోషన్స్ తో సాగే డ్రామా అని కూడా చెప్పవచ్చు. మరి ఈ సీజన్ 2 లో కూడా నీట్ గా డిజైన్ చేసిన డ్రామా ఈ తరహా డ్రామా ఎపిసోడ్స్ కోరుకునేవారికి నచ్చుతుంది. అలాగే ఎపిసోడ్ నడుస్తున్న కొద్దీ రివీల్ అయ్యే ట్విస్ట్ లు గాని అలాగే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మంచి ఆసక్తిని రేపుతాయి.

ఇన్వెస్టిగేషన్ లో నడిచే యాక్షన్ పార్ట్ అలాగే అందులో ఒకో ట్విస్ట్ రివీల్ అయ్యే విధానం సింపుల్ గా అలా ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. అలాగే సీజన్ 1 తరహాలనే సీజన్ 2 లో కూడా ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ అనేది చూసే ఆడియెన్స్ కి మనసు తేలికగా అనిపించేలా చేస్తుంది. వీటితో పాటుగా అన్సారీ ఇంకా హతీరాం పాత్రల నడుమ నడిచే సన్నివేశాలు అన్నీ ఆ పాత్రలని ఇష్టపడే వారికి మరింత నచ్చుతాయి.

ఇక నటీనటుల్లో అయితే సీజన్ 1 తో సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబర్చిన జైదీప్ ఇందులో కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టారని చెప్పాలి. చాలా సీన్స్ తో తన హార్డ్ వర్క్ ఆ ఏజ్ లో కూడా కనిపిస్తుంది. ఫిజికల్ గా కూడా ఈ సినిమాకి కష్టపడ్డారు. అలాగే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పని చేసినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం, అన్సారీపై ఓ ఎమోషనల్ సీన్ తో తన పెర్ఫామెన్స్ వీక్షకులని కదిలిస్తుంది.

అలాగే తనతో పాటే సాగే ఇస్వాక్ సింగ్ కూడా మళ్ళీ షైన్ అయ్యాడు. తనపై కనిపించే ఓ కీలక ట్విస్ట్ కి అనుగుణంగా తన నటన కూడా ఈ సీజన్లో మెప్పిస్తుంది. ఇంకా వీరితో పాటుగా నాగాలాండ్ ప్రాంతంలో కనిపించే కీలక వ్యక్తులు, ఇంకా నగేష్ కుకునూర్, తిలోత్తమా షోమే, మెరెన్ల ఇంసొంగ్ తదితరులు తమ పాత్రలకి చాలా నాచురల్ పెర్ఫామెన్స్ లు అందించి ఇంప్రెస్ చేస్తారు.

మైనస్ పాయింట్స్:

ఈ సీజన్ 2 తో చిన్న ప్రాబ్లమ్ లేకపోలేదు. మీకు గనుక సీజన్ 1 విపరీతంగా నచ్చినట్టు అయితే సీజన్ 2 ఆ రేంజ్ లో ట్రీట్ ఇవ్వకపోవచ్చు. ఇంకా సీజన్ 1 ని పూర్తి చేసి ట్రైలర్ లాంటివి చూడకుండా డైరెక్ట్ గా సీజన్ 2 ని స్టార్ట్ చేసినా కూడా వారు ఒకింత డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సీజన్ 1 నుంచి కంప్లీట్ గా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో కనిపించే నటీనటుల నుంచి మాత్రమే ఇది కొత్తగా కొనసాగుతుంది.

సో సీజన్ 1 లో ఉన్న అందరూ ఆ నటీనటులు కావాలి అనుకున్నవారు డిజప్పాయింట్ అవ్వక తప్పదు. అలాగే ఈసారి సీజన్ 1 కి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. అందులో కనిపించే సాలిడ్ వైలెన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ ఇందులో లేవు. ఇది ఒక రకంగా మంచి విషయమే కావచ్చు కానీ వాటిని మొదటి సీజన్ తో ఇష్టపడ్డవారు ఆ అంశాలతో కూడిన డ్రామా కావాలి అనుకుంటే దీనిపై తక్కువ అంచనాలు పెట్టుకోవాలి.

ఇంకా ఈసారి కథనం అనేది మరీ అంత ఇంట్రెస్ట్ గా సాగదు. చాలా స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. మొదటి నాలుగు సీజన్ల వరకు అయితే ఆ ఎపిసోడ్స్ లో ఎండింగ్ వరకు మరీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించవు. అలా స్లోగా పేలవంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. అలాగే కథనం నడుస్తున్న కొద్దీ ఒకో కొత్త పాత్ర పరిచయం అవుతూనే ఉంటాయి. ఇలా వాటి అన్నిటిని అర్ధం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. వీటితో పాటుగా యాక్షన్, ఎమోషన్ పాళ్ళని ఇంకా బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ సీజన్ కి కూడా మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా నాచురల్ గా మంచి విజువల్స్ అండ్ ఆకట్టుకునే సంగీతం, స్కోర్ లతో కీలక సన్నివేశాలు బాగానే ఎలివేట్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఈ సీజన్లో బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది. కథనం చాలా స్లోగా సాగుతుంది. ఎనిమిది ఎపిసోడ్స్ సీజన్ ని ఇంకా కుదించాల్సింది. తెలుగు డబ్బింగ్ ఇంప్రెస్ చేస్తుంది.

ఇక ఈ సిరీస్ కి సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీ రాహుల్ కనోజియా, తమల్ సేన్ లు రచన అందిస్తే అవినాష్ అరుణ్ దవారే దర్శకత్వం వహించారు. అయితే గతంలో వచ్చిన కాంట్రవర్సీలకి తగ్గారో ఏమో కానీ ఈసారి మాత్రం కొంచెం 18+ కంటెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. అలాగే వైలెన్స్ ని కూడా చాలా వరకు తగ్గించేశారు. వారి రచనకి తగ్గట్టుగానే అవినాష్ డైరెక్షన్ కూడా బాగుంది కానీ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది.

యాక్షన్ కానీ పలు ఎమోషనల్ సన్నివేశాలని కానీ ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. చాలా సీన్స్ స్లోగా నడిపించారు ఇవి తక్కువ చేయాల్సింది. ఇన్వెస్టిగేషన్ డ్రామా అలాగే నాగాలాండ్ నేపథ్యంలో కనిపించే సన్నివేశాలు విషయంలో వీరి గ్రౌండ్ వర్క్ మెప్పిస్తుంది. ఇలా ఓవరాల్ గా తన వర్క్ ఈ సీజన్ కి డీసెంట్ గా అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఓటిటిలో సూపర్ హిట్ అయినటువంటి పాతాళ లోక్ సీజన్ 1 కి కొనసాగింపుగా వచ్చిన ఈ సిరీస్ దాని రేంజ్ లోనే ఉంటుంది అనుకోని చూస్తే వారికి ఒకింత నిరాశ తప్పదు. తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే ఈ సీజన్ 2 మెప్పిస్తుంది. మంచి ఇన్వెస్టిగేషన్ సీన్స్ అలాగే పలు ఎమోషన్స్ సిరీస్ లో బాగున్నాయి. అలాగే ఒక టైంలో టీం ఎఫర్ట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. వ్యాపార సామ్రాజ్యంలో, రాజకీయాలు వాటి చుట్టూ నడిచే ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా పాతాళ లోక్ సీజన్ 2 పర్వాలేదనిపిస్తుంది. వీటితో ఒక్కసారికి ఈ సీజన్ ని ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు