ఫ్రముఖ నటి తెలంగాణ శకుంతల హఠాత్మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె నటించిన చివరి చిత్రం వరుణ్ సందేశ్ హీరోగా నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్ పాంచజన్య మీడియా ప్రై లిమిటెడ్ వారి “పడ్డానండి ప్రేమలో మరి”. మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. ఈ చిత్ర నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్ నటి తెలంగాణ శకుంతల స్వర్గస్తులు కావటం పట్ల దిగ్భ్రాంతి చెందుతూ “ఆమె చాలా మంచి నటి. మా చిత్రం షూటింగ్ లో ఆమె ఈ నెల 11, 12 తేదీలలో పాల్గొన్నారు. షూటింగ్ జరుగుతున్నంత సేపూ ఆమె అందరితో చనువుగా ఉండేవారు. అలాంటి ఆమె హఠాత్మరణం చెందడం నన్నూ, మా యూనిట్ ని దిగ్భ్రాంతికి లోను చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నను” అని అన్నారు.
దర్శకుడు మహేశ్ ఉప్పుటూరి మాట్లాడుతూ “ఒక చక్కని నటిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అన్నారు