ఆడియో సమీక్ష : ‘పడి పడి లేచె మనసు’ – మనసుకు హత్తుకుంటాయి !

ఆడియో సమీక్ష : ‘పడి పడి లేచె మనసు’ – మనసుకు హత్తుకుంటాయి !

Published on Dec 10, 2018 9:22 PM IST

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అయింది. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1. పాట : పడి పడి లేచె మనసు Padi Padi Leche Manasu

గాయనీ గాయకులు : ఆర్మన్ మాలిక్, సింధూరి విశాల్
రచన : కృష్ణ కాంత్

ఈ ఆల్బమ్ ‘పడి పడి లేచె మనసు’ పాటతోనే మొదలవుతుంది. రచయిత కృష్ణ కాంత్ వ్రాసిన సాహిత్యానికి తగినట్లుగా విశాల్ చంద్రశేఖర్ సమకాలీనమైన బీట్స్ ను అందించి ఓ ప్రత్యేకమైన టైటిల్ సాంగ్ లా ఈ సాంగ్ ని తీర్చిదిద్దారు. ఈ ‘పడి పడి లేచె మనసు’ పాట ప్రేమికులతో పాటు మ్యూజిక్ లవర్స్ ని కూడా ఆకట్టుకుంటుంది.

Kallolam2. పాట : కల్లోలం
గాయనీ గాయకులు : అనురాగ్ కులకర్ణి
రచన : కృష్ణ కాంత్

ఈ పాటను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ కల్లోలం పాట ఓ అమ్మాయిని అప్పుడే ప్రేమలో పడిన ఓ అబ్బాయి తాలూకు ఫీలింగ్స్ ను బేస్ చేసుకొని రాసింది. కృష్ణ కాంత్ ఈ పాటను తన శైలిలో చాలా చక్కని పదాలతో వ్రాయటం జరిగింది. ఇక ఈ సాంగ్ స్క్రీన్ పై ఎలా తెరకెక్కిందో సినిమాలో ఏ సిచ్యుయేషన్ లో వస్తుందో అనే అంశాల మీద ఈ పాట విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి.

3. పాట : హృదయం జరిపే Hrudayam Jaripe
గాయనీ గాయకులు : యాజిన్ నిజ‌ర్
రచన : కృష్ణ కాంత్

ఈ హృదయం జరిపే పాట ఆల్బమ్ లో మూడో పాటగా వస్తుంది. ఇక పాట గురించి చెప్పాలంటే ఆల్బమ్ లో పాట బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. సింగర్ యాజిన్ నిజ‌ర్ తన గానంతో ఈ పాటను చాలా చక్కగా పాడారు. విశాల్ చంద్రశేఖర్ శ్రావ్యమైన సంగీతాన్ని అందించడంతో పాటు.. మధ్య మధ్యలో మాస్ బిట్స్ తో ఈ సాంగ్ ను తీర్చిదిద్దారు. ఇక ఈ పాటను గాని సరైన రీతిలో చిత్రీకరించినట్లయితే, బెస్ట్ సాంగ్ అనిపించుకుంటుంది.

Emai Poyave4. పాట : ఏమైయి పోయావే.. నీ వెంటే నేను ఉంటే..
గాయనీ గాయకులు : సిడ్ శ్రీరామ్
రచన : కృష్ణ కాంత్

ఈ పాటను తెలంగాణ శైలిలో చాలా చక్కని పదాలతో వ్రాయటం జరిగింది. ఇక ఈ సాంగ్ విజయానికి స్క్రీన్ పై ఎలా తెరకెక్కిందో సినిమాలో ఏ సిచ్యుయేషన్ లో వస్తుందో అనే అంశాల మీద ఈ పాట విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి.

రచయిత కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాట ఒక నూతన విరహ గీతం. ఈ పాటలో హీరోయిన్ కోసం హీరో పడుతున్న మానసిక సంఘర్షణను కృష్ణ కాంత్ చాలా చక్కగా రాశారు. సిడ్ శ్రీరామ్ ఆకట్టుకునే వాయిస్ తో ఈ పాటను చక్కగా పాడారు.

5. పాట : ఓ మై లవ్లీ లలనా O My Lovely Lalana
గాయనీ గాయకులు : సింధూరి విశాల్
రచన : కృష్ణ కాంత్

ఓ మై లవ్లీ లలనా సాంగ్ ఈ ఆల్బమ్ లో ఐదో పాటగా వస్తోంది. ఈ పాటను కూడా కృష్ణ కాంత్ నే రాశారు. మంచి పదాలతో అర్ధవంతమైనా సాహిత్యం కారణంగా ఈ పాట బాగుంది. సింధూరి విశాల్ గానం మరియు రెగ్యులర్ విరామాలలో వచ్చే చక్కని మాడ్యులేషన్లు యువతను అలరిస్తోంది. ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం పర్వాలేదనిపిస్తోంది.

Urike Cheli Chilaka6. పాట : ఉరికే చెలి చిలకా.. గొడవే ఒక పడకా
గాయనీ గాయకులు : రాహుల్ సిప్లిగుని యమ్.యమ్ మానసి
రచన : కృష్ణ కాంత్

ఈ సాంగ్ ఈ ఆల్బమ్ లో చివర పాటగా వస్తోంది. రచయిత ఈ పాటను లోకల్ పదాలతో చాలా చక్కని వ్రాయటం జరిగింది. సింగర్స్ అద్భుతమైన గానంతో ఈ పాటను పాడగా హీరో ఉత్సాహం మరియు ప్రేమను ఈ పాట వ్యక్తపరుస్తోంది.

తీర్పు:

ఇప్పటివరకు శర్వానంద్ సినిమాల నుండి వచ్చిన మంచి ఆడియోల్లో ఈ ‘పడి పడి లేచె మనసు’ ఆడియో కూడ ఒకటిగా నిలుస్తోంది. ఒక ప్రేమ కథకు ఎలాంటి సంగీతం, ఎలాంటి పాటలు ఉంటే.. ఆ ప్రేమ కథకు ఇంకా బలం చేకూరుతుందో అచ్చం అలాంటివే ఈ పాటలు. ఉన్న ఆరు పాటల్లోకి రెండు పాటలు పర్వాలేదనిపించినా, మరో రెండు పాటలు చాలా బాగున్నాయి. ఇక ఇంకో పాట విన్న వెంటనే ఆకట్టుకొనేలా ఉండగా, మరో పాట సినిమాకే బెస్ట్ సాంగ్ లా నిలిస్తోంది. మొత్తం మీద సినిమాను ప్రేక్షకులకు ఇంకా దగ్గర చేయడంలో ఈ పాటలు బాగా దోహపడతాయి.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు