మన ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లిన దర్శక హీరోలు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే ప్రభాస్ లే అని చెప్పాలి. అయితే వారి కాంబినేషన్ లో వచ్చిన “బాహుబలి” ఇండియా వైడ్ గా సినిమా మార్కెట్ నే మార్చి పారేశాయి. దీనితో ప్రభాస్ కూడా ఇండియా వైడ్ మంచి ఫేమ్ అండ్ మార్కెట్ ని కూడా సొంతం చేసుకున్నాడు. అలాగే రీసెంట్ గానే “కల్కి 2898 ఎడి” అనే సినిమాతో ఏకంగా 1100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా దగ్గర 1000 కోట్ల వసూళ్లు ఉన్న టాప్ 3 హీరోస్ లో ఒకడిగా నిలిచాడు.
అలాగే కల్కి సినిమాలో తాను చేసిన భైరవ, కర్ణ రోల్స్ కి పాన్ ఇండియా లెవెల్లో విజిల్స్ పడ్డాయి. మరి ఇలాంటి ప్రభాస్ పై ఓ క్రిటిక్ అర్షద్ వర్సి అనే అతను అభ్యంతరకర కామెంట్స్ చేయడం ఇపుడు ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. అయితే అర్షద్ నోరు జారడంపై పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమాకి ఒక ఆడియెన్ గా రివ్యూ లేదా విమర్శించడం అనేది ఓకే.
కానీ ఆ విమర్శ కూడా ఎలాంటి పదాలు వినియోగించం అనేది కూడా ముఖ్యం అని తెలిపారు. అర్షద్ ప్రభాస్ విషయంలో అలా మాట్లాడ్డం సరి కాదని తన మాటలు జాగ్రత్తగా మాట్లాడాల్సింది అని సూచించారు. మాస్ ఆడియెన్స్ కి ఒక సినిమా నచ్చి 1100 కోట్లు వసూళ్లు ఇచ్చి ఆడియెన్స్ చేత ‘డార్లింగ్’ ని పిలవబడే ఒక హీరోని అసలు ‘జోకర్’ అని ఎలా సంభోదిస్తారు అని ప్రశ్నించారు.
ప్రభాస్ గారికి టార్గెట్ చేసే బదులు మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటే బెటర్. ప్రభాస్ బాహుబలి అనే సినిమాని ఇచ్చి మన జాతీయ ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ఇప్పుడు కల్కి 2898 ఎడి తో మన సినిమా హాలీవుడ్ సినిమాతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. సో వారి కష్టాన్ని విమర్శించే బదులు మనమంతా అండగా నిలబడితే బెటర్ అని అభిషేక్ అగర్వాల్ ప్రభాస్ కి సపోర్ట్ గా సాలిడ్ పోస్ట్ పెట్టారు. దీనితో ఇది వైరల్ గా మారింది.
It's okay to review or criticize any movie as an audience, but the words chosen by Mr. Arshad Warsi ji do not fall under constructive criticism. He should choose his words wisely.
A film loved by the masses and earning a massive ₹1100 crore, starring an actor who is the… pic.twitter.com/sIEqONUuK7
— Abhishek Agarwal ???????? (@AbhishekOfficl) August 18, 2024