గత కొన్ని రోజులు నుంచి రెండు తెలుగు స్టేట్స్ లో భారీ వర్షాలు మూలాన వరదలు ఏ స్థాయిలో ముంచెత్తాయో తెలిసిందే. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మన టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు అనేకమంది భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించడం స్టార్ట్ చేశారు. మరి ఈరోజే మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయలు ప్రకటించగా లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్స్ అండ్ ఫ్రెండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు కూడా భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు.
మరి రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకో కోటి చొప్పున మొత్తం రెండు కోట్లు ప్రకటించగా అల్లు అర్జున్ చెరో 50 లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాయలు రెండు తెలుగు స్టేట్స్ సహాయ నిధికి అందిస్తున్నట్టుగా తెలిపారు. ఇలా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి కష్టకాలంలో మన తెలుగు హీరోలు ఈ రకంగా తమ వంతు సహాయం అందించడం మంచి విషయం అని చెప్పాలి. మరి ఈ కోవలో ఇంకెంతమంది ప్రముఖులు తమ సాయాన్ని అందిస్తారో అనేది చూడాలి.