సమీక్ష: ‘పరాక్రమం’ – బోరింగ్ రివెంజ్ డ్రామా

సమీక్ష: ‘పరాక్రమం’ – బోరింగ్ రివెంజ్ డ్రామా

Published on Aug 24, 2024 3:02 AM IST
Parakramam Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 23, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: బండి సరోజ్ కుమార్, శ్రుతి సమన్వి, నాగలక్ష్మీ, మోహన్ సేనాపతి, అనిల్ కుమార్, నిఖిల్ గోపు తదితరులు

దర్శకుడు: బండి సరోజ్ కుమార్

నిర్మాతలు : బండి సరోజ్ కుమార్

సంగీత దర్శకుడు: బండి సరోజ్ కుమార్

సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

తనకు నచ్చే విధంగా కల్ట్ అండ్ బోల్డ్ సినిమాలు తీసే యాక్టర్ కమ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ తాజాగా ‘పరాక్రమం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో రివ్యూలో చూద్దాం.

 

కథ:

లంపకలోవ గ్రామంలో లోవరాజు(బండి సరోజ్ కుమార్) ఓ డ్రామా ఆర్టిస్ట్‌గా పాపులర్. అతడు హైదరాబాద్‌కు వచ్చి రవీంద్ర భారతిలో ఓ నాటకం వేయాలని ప్రయత్నిస్తుంటాడు. అతడి కోసం బుజ్జమ్మ(శ్రుతి సమన్వి) ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే, తన తండ్రి సత్తిబాబు(బండి సరోజ్ కుమార్) ‘పరాక్రమం’ అనే నాటకం రాసి పెట్టాడు. ఇంతకీ సత్తిబాబుకి సంబంధించి గతం ఏమిటి..? పరాక్రమం నాటకంలో ఏముంది..? లోవరాజు రవీంద్ర భారతిలో నాటకం ఎందుకు వేయాలని అనుకుంటాడు..? బుజ్జమ్మ అతడి కోసం ఎందుకు ఎదురుచూస్తుంది..? ఈ విషయాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

‘పరాక్రమం’ సినిమా మెయిన్ ప్లాట్ రివెంజ్ డ్రామా అయినప్పటికీ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లిన తీరు బాగుంది. సినిమా ప్రారంభంలోనే కథకు సంబంధించిన అసలు మ్యాటర్ రివీల్ చేయడంతో ప్రేక్షకుల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. ఇక సత్తిబాబు పాత్రలో బండి సరోజ్ కుమార్ పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి.

లోవరాజు పాత్రలో బండి సరోజ్ కుమార్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అతడు చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మొండితనం, మంచితనం ఉన్న పాత్ర కావడంతో లోవరాజుని ప్రేక్షకులు ఇష్టపడతారు. ఇక బుజ్జమ్మ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాకు బీజీఎం చక్కగా కుదిరింది. కొన్ని సీన్స్‌కి అది బాగా వర్కవుట్ అయ్యింది. రివెంజ్ డ్రామా కథకు ట్విస్టులు ఏమీ పెట్టకపోవడం కలిసొచ్చింది. లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా కథ కమర్షియల్ ట్రాక్‌లోకి మారడం.. నెరేషన్ చాలా స్లోగా సాగడం వంటివి ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. ఓ దశలో సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోతారు. రివెంజ్ డ్రామా అనే విషయం ముందే రివీల్ కావడంతో, ఆ రివెంజ్ ఏ విధంగా ఉంటుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. కానీ, మధ్యలో వచ్చే సీన్స్ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా కన్ఫ్యూజన్‌గా సాగడంతో సినిమా సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది.

రివెంజ్ డ్రామా కథకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నా కూడా, వాటిని ప్లేస్ చేసిన తీరు మెప్పించదు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌ను బాగా రాసుకున్నా, వాటి ఎగ్జిక్యూషన్ తేలిపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. కొన్ని అనవసరమైన సీన్స్, మధ్యలో వచ్చే క్రికెట్ సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతాయి. యాక్షన్‌కి మంచి స్కోప్ ఉన్నా దానిని పూర్తిగా వినియోగించుకోలేదు. ఇక రివెంజ్ ప్లాట్‌ని చాలా సింపుల్‌గా ముగించడం సినిమాకే మేజర్ డ్రాబ్యాక్. పరాక్రమం సినిమా ఎగ్జిక్యూషన్ కనక బాగుండి ఉంటే, ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

 

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకు బండి సరోజ్ కుమార్ వన్ మ్యాన్ షో గా వ్యవహరించాడు. దర్శకత్వం, మ్యూజిక్, ఎడిటింగ్, నిర్మాణం ఇలా అన్ని విభాగాలను ఒక్కడే హ్యాండిల్ చేశాడు. అయితే, దర్శకుడిగా అతడి పనితనం బాగున్నా, ఎడిటింగ్ విషయంలో మాత్రం చాలా వీక్‌గా కనిపించింది. అటు మ్యూజిక్ విషయంలోనూ అతడు ఇంకా మెరుగైన ఔట్‌పుట్ ఇవ్వాల్సింది. ఇక నిర్మాతగా అతడి పనితనం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనపించాయి.

 

తీర్పు:

మొత్తంగా చూస్తే, ‘పరాక్రమం’ సినిమా ఓ మంచి రివెంజ్ డ్రామాగా నిలిచే స్కోప్ ఉన్న కథ అయినప్పటికీ.. సినిమాలోని స్క్రీన్ ప్లే, ప్లాట్ ఎగ్జిక్యూషన్ వంటి విషయాలు ఈ సినిమాను ట్రాక్ తప్పేలా చేశాయి. బండి సరోజ్ కుమార్ డైలాగులు ఆకట్టుకున్నా, సినిమా డ్యామేజ్‌ని అవి కాపాడలేకపోతాయి. ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసే అంశాలు లేకపోవడంతో ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు