‘పరాశక్తి’ పంచాయితీ.. టైటిల్ ఎవరిదంటే..?

‘పరాశక్తి’ పంచాయితీ.. టైటిల్ ఎవరిదంటే..?

Published on Jan 31, 2025 1:00 AM IST

తమిళ్‌లో తెరకెక్కుతున్న రెండు సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ఆయా చిత్రాల మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ రెండు సినిమాల టైటిల్స్‌ను ఒకేసారి రిలీజ్ చేయడం.. రెండు కూడా ఒకే టైటిల్స్ కావడంతో మేకర్స్‌కు పెద్ద సమస్య ఎదురైంది. తమిళ మ్యూజిక్ కంపోజర్ కమ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాకు తెలుగులో ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీని దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కూడా ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీంతో ఈ టైటిల్ వివాదంపై రెండు చిత్రాల మేకర్స్ పరిష్కారం వెతికారు. వీరు శివ కార్తికేయన్ మూవీకి ‘పరాశక్తి’ టైటిల్ తమిళ్, తెలుగులో ఉంటుందని.. విజయ్ ఆంటోనీ చిత్రానికి ఇదే టైటిల్ హిందీ, కన్నడ, మలయాళంలో ఉంటుందని వెల్లడించారు.

అయితే, విజయ్ ఆంటోని చిత్రానికి సంబంధించిన తెలుగు టైటిల్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఏదేమైనా ఓ టైటిల్ పంచాయితీని పరిష్కరించడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు