లవ్ టుడే హీరో “డ్రాగన్” ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

లవ్ టుడే హీరో “డ్రాగన్” ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

Published on May 14, 2024 2:55 PM IST


లవ్ టుడే బ్లాక్‌బస్టర్‌తో నటుడిగా మరియు దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ ను సంపాదించిన ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు అశ్వత్ మరిముత్తుతో కలిసి డ్రాగన్‌ అనే చిత్రం ను చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, లవ్ టుడేకి నిధులు సమకూర్చిన నిర్మాణ సంస్థ AGS ఎంటర్టైన్మెంట్ ఈ డ్రాగన్ వెనుక ఉంది. తాజా అప్డేట్ ఏమిటంటే, మొదటి షెడ్యూల్‌ను చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది.

కొన్ని రోజుల తర్వాత కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జేమ్స్ సౌండ్‌ట్రాక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కావడం ఖాయమైంది. ఈ సినిమా కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు