‘పఠాన్’ ఓటిటి లో రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా భారీ స్థాయిలో యువ దర్శకుడు సిద్దార్థ ఆనంద్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్. జాన్ అబ్రహం విలన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేయగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. ఇక హిందీ సహా పలు భాషల్లో ఇటీవల రిలీజ్ అయిన పఠాన్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం ఈమూవీ రూ. 1000 కోట్ల గ్రాస్ కలక్షన్ మార్క్ ని దాటి మరింతగా దూసుకుపోతోంది పఠాన్ మూవీ. అయితే విషయం ఏమిటంటే, అటు షారుక్ ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ సైతం పఠాన్ ఓటిటి రిలీజ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కాగా లేటెస్ట్ బాలీవుడ్ బజ్ ప్రకారం ఇప్పటికే ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ ని భారీ ధరకి దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దీనిని ఏప్రిల్ ఆఖరి వారంలో రిలీజ్ చేయనున్నారట. అయితే దీని పై అఫీషియల్ గా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

Exit mobile version