బెల్లంకొండ శ్రీనివాస్‌ ను డైరెక్ట్ చేయనున్న పవన్ డైరెక్టర్!

బెల్లంకొండ శ్రీనివాస్‌ ను డైరెక్ట్ చేయనున్న పవన్ డైరెక్టర్!

Published on Mar 30, 2023 3:00 PM IST

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు డైరెక్టర్ సాగర్ కె చంద్ర. ఆ తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ని భీమ్లా నాయక్‌లో డైరెక్ట్ చేసే సువర్ణావకాశం వచ్చింది. పవన్ ని మాస్ అవతార్ లో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. భీమ్లా నాయక్ తర్వాత, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నాడు. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో సాగర్ కె చంద్ర కలిసి సినిమా చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ అసోసియేషన్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. దీని ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ 10వ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట మరియు గోపి ఆచంట బ్యాంక్రోల్ చేయనున్నారు. హీరోయిన్ మరియు ఇతర సిబ్బందికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు