పవన్ సెటప్ అదిరింది.. రెండూ పక్కపక్కనే

Published on Jan 18, 2021 11:08 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పనుల్ని ముగించేసి తర్వాతి సినిమాలను మొదలుపెట్టారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్, కృష్ణ డైరెక్షన్లో ఒక పిరియాడికల్ మూవీని చేస్తున్నారు. టైమ్ చాలా తక్కువ ఉండటంతో పవన్ రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నారు. పైగా రెండు చిత్రాల్లోనూ ఆయన లుక్ దాదాపు ఒకేలా ఉండటంతో ఈ ప్లాన్ బాగా కలిసొచ్చింది.

హైదరాబాద్ నగర శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద రెండు సినిమాల సెట్లను నిర్మించారు. పవన్ కంఫర్ట్ కోసం సెట్లు రెండూ పక్కపక్కనే ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పవన్ తక్కువ వ్యవధిలోనే రెండు సినిమాల షూటింగ్లల్లో పాల్గొంటున్నారు. మధ్యలో ట్రావెలింగ్ టైమ్ చాలావరకు తగ్గిపోయింది. పవన్ డేట్లను దృష్టిలో పెట్టుకుని రెండు సినిమా బృందాలు ఇలా ఒక అవగాహనతో పరస్పరం సహకరించుకోవడం నిజంగా అభినందించదగిన విషయమే. ఈ రెండింటిలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ముందుగా పూర్తయ్యే అవకాశం ఉండగా పిరియాడికల్ మూవీ కాబట్టి క్రిష్ సినిమా ఎక్కువ సమయం తీసుకునేలా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :