పవన్ నయా లుక్ కోసమే అంతా వెయిటింగ్.!

Published on Oct 31, 2020 8:04 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న తాజా “వకీల్ సాబ్”. పవన్ కం బ్యాక్ చిత్రం కావడంతో దీనిపై వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు పెద్ద బ్రేక్ వచ్చిన తెలిసిందే. దీనితో పవన్ అభిమానులకు మరింత స్థాయిలో ఎదురు చూపులు తప్పలేదు. ఇక ఇదిలా ఉండగా పవన్ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కానీ లాక్ డౌన్ వల్ల వచ్చిన గ్యాప్ మూలాన చాతుర్మాస దీక్ష వలన చాలా సాధారణ జీవనం కొనసాగించడంతో లుక్స్ పరంగా తీసుకోవడం జరగలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ షూట్ కు ఓకే చెప్పడంతో కొత్త లుక్ ప్రిపేర్ చెయ్యడం తప్పనిసరి కావడంతో ఈ ఫ్రెష్ లుక్ కోసం పవన్ అభిమానులు అంతా ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ అనంతరం చెయ్యాల్సిన ప్రాజెక్ట్ కు వరుసబెట్టి ఉండడంతో వాటిలో కూడా పాల్గొనాల్సి ఉంది. అందుకే అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కొద్ది రోజుల్లోనే పవన్ నయా లుక్ బయటకొచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More