పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సారిగా ఓ స్ట్రీమింగ్ యాప్ ఆహా లో నందమూరి నటసింహం బాలకృష్ణ సెన్సేషనల్ టాక్ షో అన్ స్టాప్పబుల్ 2 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో పవన్ పాల్గొన్నారు. అయ్యితే మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ తాలూకా రెండో పార్ట్ ని ఆహ వారు ఒకరోజు ముందే అంటే నిన్న రాత్రే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు.
అయితే పవన్ మొదటి సారి ఇలా ఓ టాక్ షో లో పాల్గొననుండడం అనేది తన అభిమానుల్లో ఆసక్తిగా మారగా మొదటి ఎపిసోడ్ కి రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ ఇది మొదటి ఎపిసోడ్ కావడంతో దానికి గట్టి రెస్పాన్స్ వచ్చింది కానీ పవన్ ని అమితంగా అభిమానించే వారు మాత్రం రెండో ఎపిసోడ్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్నారట.
ఇందులోనే పవన్ నుంచి తెలియని చాలా విషయాలు తెలియడం ఎమోషనల్ గా కూడా కనెక్ట్ కావడంతో అయితే మొదటి ఎపిసోడ్ కన్నా రెండో ఎపిసోడ్ కే బాగా నచ్చింది అని వారు ఎక్కువగా ఓట్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ మొట్టమొదటి ఓటిటి ఎంట్రీ విత్ బాలయ్య ఓ మెమొరబుల్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.