అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్ !

Published on Aug 15, 2020 9:08 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేదు. సినిమా ఎలా ఉన్నా, అయన సినిమా కలెక్షన్ల నుండి రికార్డుల వరకు అన్నిటిలోనూ ట్రేడ్ మార్క్ సెట్ చేస్తాయి. మళ్ళీ చాల గ్యాప్ తరువాత పవన్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా, కరోనా వల్ల పోస్ట్ పోన్ అయింది. దాంతో ఈ సినిమా అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ అర్రులు చాస్తోన్నారు. మరి ఫ్యాన్స్ కోసమైనా మేకర్స్ అప్ డేట్ ఇస్తారేమో చూడాలి.

కాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాటలు గొప్పగా ఉండేలా ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఇకపోతే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కరోనా ప్రభావం తగ్గాక విడుదలకానుంది. ఈ చిత్రంతో పాటే దర్శకుడు క్రిష్ సినిమాలో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ రెండూ పూర్తవగానే దర్శకుడు హరీష్ శంకర్ తో మరో చిత్రాన్ని స్టార్ట్ చేసేలా పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నిల్ ఇచ్చాడట.

సంబంధిత సమాచారం :

More