హరీష్ శంకర్ మళ్ళీ పోలీస్ కథతోనే.. !

హరీష్ శంకర్ మళ్ళీ పోలీస్ కథతోనే.. !

Published on Aug 2, 2020 2:43 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా కూడా పోలీస్ కథేనట. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది. ఆ కారణంగానే ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.

అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. కాగా ఇప్పుడు చేయబోయే చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందట. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. కరోనా ప్రభావం తగ్గాక ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలవుతుంది. ఇక క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు