Pawan: శ్రీవారి లడ్డు వివాదంపై పవన్ హీరోయిన్ కామెంట్స్

Pawan: శ్రీవారి లడ్డు వివాదంపై పవన్ హీరోయిన్ కామెంట్స్

Published on Sep 20, 2024 7:10 AM IST

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఊహించని విధంగా వినిపిస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే అది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ఆలయం తిరుమలలో జరిగిన దారుణ విషయం కోసమే అని చెప్పాలి. మొత్తం భారత దేశ హిందువులు అంతా తిరుమల లడ్డులో జరిగిన షాకింగ్ కల్తీ పై మాట్లాడుతున్నారు. అయితే లేటెస్ట్ గా పవన్ అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా ఈ అంశంపై మాట్లాడింది.

శ్రీవారి విషయంలో ఇలా జరగడం ఎంతో దారుణమైన అంశం అని శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడడం అనేది చిన్న తప్పు కాదని దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని తెలిపింది. అలాగే ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు నిజంగా కలలో కూడా ఊహించనిది అంటూ ప్రణీత సుభాష్ నోరు విప్పింది. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు