ఫోటో మూమెంట్: తన “ఓజి” స్క్వాడ్ తో షూటింగ్ కి రెడీ అవుతున్న పవన్!

ఫోటో మూమెంట్: తన “ఓజి” స్క్వాడ్ తో షూటింగ్ కి రెడీ అవుతున్న పవన్!

Published on Aug 22, 2024 8:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ సైతం రాజకీయాల్లో బిజీగా ఉండటం, షూటింగ్ కి అందుబాటులో లేకపోవడంతో సినిమాకి బ్రేక్ పడింది.

మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. తన ఓజి స్క్వాడ్ తో పవన్ షూటింగ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలో పవన్ కళ్యాణ్ సెట్స్ లో జాయిన్ కానున్నారు. దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్ దానయ్య ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది. అభిమానులు సినిమా మళ్ళీ షూటింగ్ మోడ్ లోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు