అన్నయ్య పుట్టినరోజుకి పవన్ బ్యూటిఫుల్ బర్త్ డే విషెస్.!

అన్నయ్య పుట్టినరోజుకి పవన్ బ్యూటిఫుల్ బర్త్ డే విషెస్.!

Published on Aug 22, 2024 11:00 AM IST

మెగా అభిమానులకి అన్నయ్య అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర రీ రిలీజ్ (Indra Re Release) హంగామా ఇప్పుడు ఓ రేంజ్ లో కనిపిస్తుండగా ఈ ఊపులోనే తన లేటెస్ట్ భారీ చిత్రం “విశ్వంభర” (Vishwambhara) ఫస్ట్ లుక్ కూడా బయటకి వచ్చింది. ఇలా మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన బూస్టప్ అంతా ఓ రేంజ్ లో వచ్చేస్తుండగా చిరు సోదరుడు టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన బ్యూటిఫుల్ విషెస్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

తన మాటలుగా పోస్ట్ చేసి, ఆపద్బాంధవుడు అన్నయ్య అంటూ మొదటి హెడింగ్ హైలైట్ గా పెట్టి.. “నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగ మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు.

అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో!
గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను”. అని పవన్ అన్నయ్య మీద ప్రేమని తన అభిమానాన్ని చూపించారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు