పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో గత కొన్ని రోజులుగా సినిమాలు సహా రాజకీయ పరంగా కూడా వార్తలు అలా వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో పొలిటికల్ పరంగా మంచి హాట్ టాపిక్ అయ్యారు. అలాగే రీసెంట్ గా సనాతన ధర్మం కోసం మాట్లాడిన మాటలు తీసుకున్న చర్యలు కూడా దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
కానీ నిన్న తను చేపట్టిన మీటింగ్ తో మాత్రం పవన్ మరోసారి నేషనల్ వైడ్ న్యూస్ గా మారారు. కోలీవుడ్ నటుడు తమిళ ఉప ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు సనాతన ధర్మం విషయంలో చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఒక్క పాన్ ఇండియా స్పీచ్ తో అయితే పవన్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేయకుండానే పాన్ ఇండియా ప్రేక్షకులలో హాట్ టాపిక్ గా మారిపోయారు అని చెప్పాలి.