చివరి షెడ్యూల్‌లో ‘హరిహర వీరమల్లు’.. యాక్షన్ మోడ్‌లో పవన్ బిజీబిజీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఈ చివరి షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్‌లోకి మారాడు. దీనికి సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ షెడ్యూల్‌తో ఈ భారీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగుస్తుందని మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version