పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ మాస్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే సాలిడ్ కంటెంట్ ని మేకర్స్ చేసేసి ఆశ్చర్య పరిచారు. దీనితో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై నిర్మాత రవి శంకర్ కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి.
కళ్యాణ్ గారి క్రేజ్ ముందు ఏ పాన్ ఇండియా సినిమా కూడా పనికిరాదు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. నితిన్ రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. పవన్ డేట్స్ కోసం తాము ఎదురు చూస్తున్నాము అని వచ్చే ఏడాది ఎలాగైనా సినిమా రిలీజ్ చేస్తామని పవన్ ఫ్యాన్స్ కి క్రేజీ కిక్ ని వారు అందించారు. దీనితో ఈ సాలిడ్ స్టేట్మెంట్ మంచి వైరల్ గా చక్కర్లు కొడుతోంది.