సుజీత్.. లోకేష్ కనగరాజ్.. డిజప్పాయింట్ అయ్యిన పవన్ ఫ్యాన్స్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో యంగ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. అయితే పవన్ పలు సందర్భాల్లో తన సినిమాల పేర్లు ఆ సినిమాల తాలూకా దర్శకుల పేర్లు కూడా గుర్తుండవు అని చెబుతూ ఉంటారు.

అలానే ఆ మధ్య పవన్ తన ఓజి దర్శకుడు సుజీత్ పేరు కూడా మర్చిపోయిన సందర్భం ఉంది. కానీ లేటెస్ట్ గా తమిళనాట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పవన్ తనకి తమిళ్ నుంచి రీసెంట్ గా కమెడియన్ యోగిబాబు నటించిన “మండేలా” నచ్చింది అని అలాగే మరో సినిమా “లియో” కూడా చూశానని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసిన సినిమా అంటూ చెప్పడం వైరల్ అయ్యింది.

దీనితో మనం చేసే సినిమాలు మీద తన సినిమా దర్శకుల పేర్లు గుర్తు లేదు కానీ కోలీవుడ్ సినిమా పేరు ఆ సినిమా దర్శకుడు పేరు కూడా గుర్తుంది అని పవన్ విషయంలో తన ఫ్యాన్సే ఇపుడు కొంచెం డిజప్పాయింట్ అవుతున్నారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version