సరిపోదా శనివారం: నానికి గట్టిగా సపోర్ట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

సరిపోదా శనివారం: నానికి గట్టిగా సపోర్ట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

Published on Aug 14, 2024 3:00 AM IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ట్రైలర్ ను విడుదల చేసిన కొద్ది సేపటికే మిలియన్స్ లో వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.

ఈ ట్రైలర్ లాంఛ్ సుదర్శన్ 35 ఎంఎం లో జరిగింది. నాని ఫ్యాన్స్ కి ట్రైలర్ ఫుల్ కిక్ ఇచ్చింది అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈవెంట్ కి వచ్చారు. ఓజి కి సంబందించిన అప్డేట్ ఏదైనా వెల్లడిస్తారేమో అని ఫ్యాన్స్ ఆశించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు నాని సరిపోదా శనివారం చిత్రానికి గట్టి సపోర్ట్ ను అందిస్తున్నారు. టాలీవుడ్ లో ఇలాంటి పరిణామాలు రావడం పట్ల ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు