లేటెస్ట్ పిక్స్ : కనుమ పండుగ సందర్భంగా గోవులను పూజించి ఆహారం అందించిన పవన్

లేటెస్ట్ పిక్స్ : కనుమ పండుగ సందర్భంగా గోవులను పూజించి ఆహారం అందించిన పవన్

Published on Jan 16, 2023 11:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలతో పాటు అటు తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తోన్న పవన్ కళ్యాణ్, అనంతరం మరొక మూడు సినిమాలు లైన్లో పెట్టారు. ఇక తీరిక వేళల్లో తన వ్యవసాయ క్షేత్రంలో పశుపక్ష్యాదులతో కాలం గడిపే అలవాటు గల పవన్ నేడు కనుమ పండుగని పురస్కరించుకుని పలు గోవులను పూజించి ఆహారం అందించారు.

కనుమ అంటే పశుపక్ష్యాదులను గౌరవించే పండుగ .రైతుకు వ్యవసాయంలో సాయంచేసే పశువులను ఆరాధించే గొప్ప వేడుక. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేడు సంప్రదాబద్దంగా వ్యవసాయ క్షేత్రంలో కనుమ వేడుక జరిపారు. అనంతరం గోపూజ నిర్వహించి ఆవులకు స్వయంగా అరటిపళ్ళు నోటికి అందించారు. గోష్ఠంలోని అన్ని గోవులకు మేత వేశారు. ఈ సందర్భంగా పవన్ గోవులను పూజించి ఆహారం అందిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు