“గేమ్ ఛేంజర్” కోసం పవర్ స్టార్ ఖరారు..మరి డేట్?

“గేమ్ ఛేంజర్” కోసం పవర్ స్టార్ ఖరారు..మరి డేట్?

Published on Dec 20, 2024 9:01 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ తో సిద్ధం అవుతుంది.

అయితే ఆల్రెడీ యూఎస్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం సుకుమార్ గెస్ట్ గా వస్తుండగా మన దగ్గర జరిగే ప్రీ రిలీజ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం దాదాపుగా ఖరారు చేసేసారు అని తెలుస్తోంది. మరి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ దాదాపు ఏపీ లోనే చేయనున్నారట.

ఇక ప్రస్తుతానికి డేట్ ని లాక్ చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టుగా టాక్. మొత్తానికి అయితే మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్న బిగ్గెస్ట్ ఈవెంట్ సాధ్యపడేలా ఉందని ఇపుడు చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు