న్యూ ఇయర్ రోజున ‘వీరమల్లు’ ట్రీట్..?

న్యూ ఇయర్ రోజున ‘వీరమల్లు’ ట్రీట్..?

Published on Dec 31, 2024 10:56 PM IST

2024 సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేకం అని చెప్పాలి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర లిఖించారు. అయితే, ఆయన నుంచి 2024లో ఒక్క సినిమా కూడా రాకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. కానీ, 2025లో పవన్ నుంచి వరుసగా చిత్రాలు వస్తుండటంతో అభిమానులు ఈ సినిమాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, 2025 సంవత్సరాన్ని సాలిడ్ అప్డేట్‌తో మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నాడట. దీంతో ఆయన నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి జనవరి 1న ఓ సాలిడ్ ట్రీట్ అయితే రానుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను న్యూ ఇయర రోజున రిలీజ్ చేయనున్నారని.. ఈ పాటకు పవన్ కళ్యాణ్ వాయిస్ అందించారని.. ఏకంగా 5 భాషల్లో పవన్ తన వాయిస్ అందించినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే, అభిమానులు మాత్రం ఈ వార్తతో ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇక పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్, నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా ఏఎం రత్నం ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు