నితీష్ కుమార్ రెడ్డిపై పవన్ కీలక కామెంట్స్..

ఇప్పుడు ఇండియా వైడ్ గా వినిపిస్తున్న అండ్ టాలెంటెడ్ క్రికెటర్స్ లో నితీష్ కుమార్ రెడ్డి పేరు కోసం అందరికీ తెలిసిందే. మరి మన తెలుగు నుంచి వెళ్లిన టాలెంటెడ్ క్రికెటర్ గా నితీష్ ఇపుడు ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ కొట్టి సత్తా చాటాడు. అయితే తనపై అనేకమంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా లేటెస్ట్ గా పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేయడం ఇపుడు వైరల్ గా మారింది.

తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ లో ఎక్కడ నుంచి వచ్చాం అని కాదు భారత్ కి ఎంత పేరు తీసుకొచ్చాం అనేది ముఖ్యం. ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత యుక్త వయస్సులో సెంచరీ చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించావు. నువ్ మరిన్ని వరల్డ్ క్లాస్ రికార్డులు అందుకొని భారతమాతని గర్వించేలా చెయ్యాలి అంటూ పోస్ట్ చేశారు. దీనితో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారగా భారత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version