పుల్ స్వింగ్ లో “ఓజి”..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి పవన్ కెరీర్లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ భారీ చిత్రం షూటింగ్ మొదలైన మొదట్లో చాలా వేగంగా పూర్తి చేసుకుంది. కానీ గ్యాప్ రావడంతో మాత్రం చాలా ఆలస్యం అయ్యింది. మరి మళ్లీ ఎప్పుడు షూటింగ్ రీస్టార్ట్ అవుతుంది అనే సమయంలో ఎట్టకేలకు మళ్లీ రీస్టార్ట్ అయ్యింది.

ఇలా ఓజి షూటింగ్ మళ్లీ మొదలై శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. దీనితో మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు. మరి అలా లేటెస్ట్ గా సెట్స్ లో సుజిత్, థమన్ లు కలిసి సినిమా కోసం డిస్కస్ చేస్తున్న కొన్ని పిక్స్ షేర్ చేసి అప్డేట్ అందించారు. ఇలా ఓజి మొత్తానికి మళ్లీ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version