బ్యాంకాక్ షెడ్యూల్ ముగించుకున్న ‘ఓజి’

బ్యాంకాక్ షెడ్యూల్ ముగించుకున్న ‘ఓజి’

Published on Dec 19, 2024 9:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజి’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి.

దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవల బ్యాంకాక్‌లో ప్రారంభించారు చిత్ర యూనిట్. పలు కీలక యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ బ్యాంకాక్ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. అయితే, ఇప్పుడు బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన ఓ బిటిఎస్ ఫోటోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ‘ఓజి’ చిత్రంతో పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు