‘ఓజి’ షూటింగ్.. బ్యాక్ టు సెట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ చిత్రాల షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే, ‘ఓజి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి.

కాగా, ఈ చిత్ర షూటింగ్ గతకొద్ది రోజులుగా వాయిదా పడింది. పవన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ‘ఓజి’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు అభిమానుల్లో మరోసారి ఈ సినిమాపై అటెన్షన్ పెరిగింది. ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్నాడు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version